ఐటీటీఎఫ్ వరల్డ్ కప్‌లో ముగిసిన శ్రీజ పోరాటం

ఐటీటీఎఫ్ వరల్డ్ కప్‌లో భారత క్రీడాకారిణి, తెలుగమ్మాయి ఆకుల శ్రీజ ప్రయాణం గ్రూపు దశలోనే ముగిసింది.

Update: 2024-04-17 16:19 GMT

దిశ, స్పోర్ట్స్ : మకావులో జరుగుతున్న ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్(ఐటీటీఎఫ్) వరల్డ్ కప్‌లో భారత క్రీడాకారిణి, తెలుగమ్మాయి ఆకుల శ్రీజ ప్రయాణం గ్రూపు దశలోనే ముగిసింది. బుధవారం జరిగిన రెండో గ్రూపు మ్యాచ్‌లో శ్రీజ 1-3(11-4, 11-4, 15-13, 2-11) తేడాతో చెన్ మెంగ్(చైనా) చేతిలో ఓడింది. దీంతో గ్రూపు-4లో రెండు మ్యాచ్‌లు ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. అలాగే, భారత స్టార్ క్రీడాకారిణి మనికా బాత్రా కూడా గ్రూపు దశలోనే ఇంటిదారిపట్టింది. తొలి గ్రూపు మ్యాచ్‌లో నెగ్గిన ఆమె రెండో మ్యాచ్‌లో ఓడటంతో ముందడుగు వేయలేకపోయింది. రెండో మ్యాచ్‌లో మనికా బాత్రా 0-4(6-11, 4-11, 9-11, 4-11) తేడాతో వరల్డ్ నం.2 వాంగ్ మన్యు(చైనా) చేతిలో పరాజయం పాలైంది.

మరోవైపు, చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న వరల్డ్ టేబుల్ టెన్నిస్(డబ్ల్యూటీటీ) ఫీడర్ హవిరోవ్ టోర్నీలో భారత ఆటగాడు మానవ్ వికాస్ ఠక్కర్ జోరుకు బ్రేక్ పడింది. మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మానవ్ 1-3(7-11, 11-13, 11-9, 11-13) తేడాతో పొలాండ్ ఆటగాడు మిలోజ్ రెడ్జిమ్స్కీ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్ర్కమించాడు.

Tags:    

Similar News