మాడ్రిడ్‌ ఓపెన్‌లో భారత జోడికి నిరాశ..

ఏటీపీ మాస్టర్స్‌ 1000 టెన్నిస్‌ టోర్నీ మాడ్రిడ్‌ ఓపెన్‌లో టైటిల్‌ సాధించేందుకు బరిలోకి దిగిన భారత జోడీకి నిరాశ ఎదురైంది.

Update: 2023-05-07 10:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏటీపీ మాస్టర్స్‌ 1000 టెన్నిస్‌ టోర్నీ మాడ్రిడ్‌ ఓపెన్‌లో టైటిల్‌ సాధించేందుకు బరిలోకి దిగిన భారత జోడీకి నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన ఫైనల్లో బోపన్న – మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడి ఓటమిపాలైంది. 69 నిమిషాల పాటు సాగిన పోరులో రష్యాకు చెందిన కరెన్‌ ఖచనోవ్‌ – ఆండ్రీ రుబ్లెవ్‌ 6–3, 3–6, 10–3 స్కోరుతో బోపన్న – ఎబ్డెన్‌పై విజయం సాధించారు.

Tags:    

Similar News