Luis Rubiales: ముద్దు వివాదం.. ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్‌ కీలక నిర్ణయం

స్పెయిన్ మహిళా వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ప్లేయర్‌ను ముద్దు పెట్టుకొని విమర్శల పాలైన స్పెయిన్‌ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్‌ లూయిస్‌ రుబియాలెస్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2023-09-11 10:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్పెయిన్ మహిళా వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ప్లేయర్‌ను ముద్దు పెట్టుకొని విమర్శల పాలైన స్పెయిన్‌ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్‌ లూయిస్‌ రుబియాలెస్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆగస్టు నెలలో సిడ్నీలో జరిగిన ఫైనల్‌లో 1-0 తేడాతో ఇంగ్లాండ్‌‌ను ఓడించి స్పెయిన్ ఫిఫా మహిళల ప్రపంచకప్‌ టైటిల్‌ను తొలిసారి అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జట్టు సభ్యులకు మెడల్స్‌ అందిస్తూ.. స్పెయిన్‌ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్‌ లూయిస్‌ రుబియాలెస్‌ క్రీడాకారిణులతో అనుచితంగా ప్రవర్తించారు. స్టార్‌ ప్లేయర్ అయిన జెన్నిఫర్ హెర్మోసో ను ముద్దు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో స్పెయిన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది.

ఈ ముద్దు వివాదమే ఎక్కువగా వార్తల్లో నిలవడంతో తొలిసారి చాంఫియన్‌గా నిలిచామన్న ఆనందం స్పెయిన్ మహిళా జట్టుకు లేకుండా పోయింది. క్రీడాకారిణి అంగీకారంతోనే ముద్దు పెట్టిన్నట్టు లూయిస్‌ తెలపగా.. అందుకు తాను అంగీకరించలేదంటూ హెర్మోసో స్పందించింది. ఈ క్రమంలోనే ఆయనపై ఫిఫా సస్పెన్షన్‌ వేటు వేసింది. ఇక ఆదివారం అర్ధరాత్రి రూబియాలెస్‌ తన రాజీనామాను ప్రకటించారు.

Tags:    

Similar News