అందమే ఆ అథ్లెట్ కు శాపమైందా..!

ఆమె అందం మమ్మల్ని చూపు తిప్పుకోనివ్వడం లేదంటూ తోటి అథ్లెట్స్ ఫిర్యాదు చేయడంతో ఒలంపిక్ గ్రామం నుండి ఇంటిముఖం పట్టిందో అథ్లెట్.

Update: 2024-08-08 16:53 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆమె అందం మమ్మల్ని చూపు తిప్పుకోనివ్వడం లేదంటూ తోటి అథ్లెట్స్ ఫిర్యాదు చేయడంతో ఒలంపిక్ గ్రామం నుండి ఇంటిముఖం పట్టిందో అథ్లెట్. వివరాల్లోకి వెళితే.. పరాగ్వేకి చెందిన లువానా అలాన్సో అనే 20 ఏళ్ల స్విమ్మర్ పారిస్ ఒలంపిక్స్ లో తన దేశం తరపున పాల్గొని సెమీస్ వరకు వచ్చింది. అయితే ఒలంపిక్ గ్రామంలో తన దేశ క్రీడాకారులతో కలిసి ఉంటూ, అన్ని ఈవెంట్లను తిలకిస్తోంది. ఇదిలా ఉంటే అలాన్సో అందం మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ, పోటీల మీద కాన్సంట్రేట్ చేయనివ్వడం లేదు, ఆమె ఇక్కడే ఉంటే మేము ఆటల్లో పాల్గొనలేము అంటూ మేల్ అథ్లెట్లు మేనేజ్మెంట్ కు ఫిర్యాదు చేశారు. పరాగ్వే దేశ అధికారులు మేల్ అథ్లెట్ల మాటకే విలువనిస్తూ... ఆమెను వెంటనే దేశానికి రమ్మంటూ ఆదేశాలు జారీ చేసింది. స్విమ్మింగ్ లో ఎంతో భవిష్యత్తు ఉన్న అలాన్సో ఈ ఘటనపై ఆవేదన చెంది కన్నీళ్లతో ఒలంపిక్ గ్రామాన్ని వీడింది. ఇకపై తాను పరాగ్వే తరపున ఆడబోనని గుడ్ బై చెప్పేసింది. సొంత దేశపు క్రీడాకారులే తనపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధగా ఉందంటూ పేర్కొంది. అంతర్జాతీయ మీడియా సైతం టూ హాట్ అథ్లెట్ అంటూ సంబోధించడం పట్ల మండిపడింది. పాపం తన అందమే తనకు శాపమైంది అలాన్సోకు.          


Similar News