భారత క్రికెట్‌ జట్టుకు అభినందనలు తెలిపిన లోక్‌సభ.. తర్వాత?

లోక్‌సభ సమావేశాలు ఐదోరోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశాలు స్టార్ట్ చేశారు.

Update: 2024-07-01 07:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ సమావేశాలు ఐదోరోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశాలు స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చలు జరిపారు. అయితే విపక్ష నేతలు కొత్త క్రిమినల్ చట్టాలు, నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. పరీక్ష పత్రం లీకేజి వ్యవహారంపై సభలో చర్చించాలని విపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రస్తావించారు. ఈ విషయంపై తాము వాయిదా తీర్మానం నోటీసు కూడా ఇచ్చినట్లు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ప్రస్తుత సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, శూన్య గంట లేవు కాబట్టి.. వాయిదా తీర్మానాలను తీసుకోవడం కుదరదని స్పీకర్‌ ఓం బిర్లా చెప్పారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాత్రమే చర్చకు అవకాశాం ఉందని స్పీకర్‌ స్పష్టంచేశారు. దీంతో విపక్ష సభ్యులకు స్పీకర్‌కు మధ్య వాదన కొనసాగింది. ఈ క్రమంలోనే రాహుల్‌గాంధీ మైక్ కట్ చేశారు. కాగా, కొత్త క్రిమినల్ చట్టాలు, నీట్, యూజీసీ, ఎన్‌టీఏ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టగా స్పీకర్ అంగీకరించకపోవడంతో సభ్యులు వాకౌట్ ప్రకటించారు. అనంతరం వారంతా పార్లమెంట్‌ బయటకు వచ్చి అధికార బీజేపీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఆ వెంటనే మెయిన్‌ గేట్‌ దగ్గర ఇండియా కూటమి నేతలు ఆందోళన చేపట్టారు.

భారత క్రికెట్‌ జట్టుకు అభినందనలు తెలిపిన లోక్‌సభ

సభ ప్రారంభం కాగానే టీ 20 ప్రపంచకప్‌లో గెలుపొందిన టీమ్‌ ఇండియా జట్టుకు స్పీకర్‌ ఓం బిర్లా , ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. కెప్టెన్‌ రోహిత్‌శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌కోహ్లీ, చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సహా టీమ్‌ఇండియా జట్టు మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News