Asia Cup 2023: ఆసియాకప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్‌.. స్టార్ ఓపెనర్ ఔట్

ఆసియాకప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్‌ తగిలింది.

Update: 2023-08-30 10:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాకప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ లిట్టన్ దాస్ అనారోగ్యం కారణంగా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. గత కొన్ని రోజుల నుంచి లిట్టన్‌ దాస్‌ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఈ మెగా ఈవెంట్‌ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానాన్ని మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అనముల్ హక్ బిజోయ్‌ను బంగ్లాదేశ్ సెలక్టర్లు భర్తీ చేశారు. ఇప్పటి వరకు 44 వన్డేలు ఆడిన అనాముల్ హక్.. 1254 పరుగులు చేశాడు.

బంగ్లాదేశ్‌ జట్టు:

షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హుస్సేన్ , మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, నసుమ్ అహ్మద్, షక్ మహ్మద్, షక్ మహ్మద్ తాంజిద్ హసన్ తమీమ్, తంజిమ్ హసన్ సాకిబ్, అనముల్ హక్ బిజోయ్


Similar News