అతనే నా ఆరాధ్య దైవం : Kuldeep Yadav
ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ తన ఆరాధ్య దైవమని భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తెలిపాడు.
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ తన ఆరాధ్య దైవమని భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తెలిపాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకపోవడంతో లభించిన విశ్రాంతిని కుల్దీప్ ఆస్వాదిస్తున్నాడు. కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఈ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ క్వార్టర్స్, మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని సందర్శించాడు. ఎంసీజీ గ్రౌండ్ వద్ద ఉన్న షేన్ వార్న్ విగ్రహం వద్ద ఫొటోలు దిగాడు.
ఈ సందర్భంగా షేన్ వార్న్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ‘షేన్ వార్నర్ నాకు ఆరాధ్య దైవం. అతనితో నాకు చాలా బలమైన బంధం ఉంది. వార్న్ గురించి ఆలోచించినప్పుడులా నేను ఎమోషనల్ అవుతా. నా కుటుంబంలో ఒకరిని కోల్పోయినట్టు ఉంది.’ అని చెప్పాడు.
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్నట్టు కుల్దీప్ తెలిపాడు. ‘ఈ ఏడాది భారత్, ఆసిస్ జట్ల మధ్య గొప్ప క్రికెట్ పోటీ ఉంటుందని ఆశిస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులు ఎల్లప్పుడూ జట్టుకు మద్దతుగా నిలుస్తారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముఖ్యంగా, బాక్సింగ్ డే టెస్టుకు భారీ సంఖ్యలో హాజరవుతారని అనుకుంటున్నా.’ అని చెప్పుకొచ్చాడు. కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు నవంబర్‌లో ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఆ సిరీస్‌కు ఎంపిక చేసే జట్టులో కుల్దీప్ కూడా చోటు దక్కే అవకాశం ఉంది.