Sachin Tendulkar రికార్డును బద్దలు కొట్టిన Virat Kohli
భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని అతని అభిమానులు రన్ మిషన్‌గా పిలుచుకుంటారు. టీ20 వరల్డ్ కప్ 2022 లో విరాట్ మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు. ముఖ్యమైన మ్యాచ్‌లలో తనదైన శైలిలో ఆడుతూ భారత్ కు గట్టి విజయాలను అందిస్తున్నాడు.
దిశ, వెబ్‌డెస్క్: భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని అతని అభిమానులు రన్ మిషన్‌గా పిలుచుకుంటారు. టీ20 వరల్డ్ కప్ 2022 లో విరాట్ మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు. ముఖ్యమైన మ్యాచ్‌లలో తనదైన శైలిలో ఆడుతూ భారత్ కు గట్టి విజయాలను అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను అనేక ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. నిన్న అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్ తో ఆడిన మ్యాచ్ కోహ్లీ 44 బంతుల్లో 64 పరుగులు చేశాడు.
దీంతో కోహ్లీ విదేశాలలో అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్న సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ బద్దలు కొట్టాడు. అలాగే నిన్నటి మ్యాచ్ స్కోర్ తో కోహ్లీ ఆస్ట్రేలీయాలో తన 3,350 పరుగులు చేశాడు. అంతకు ముందు ఆస్ట్రేలియా సచిన్ టెండూల్కర్ 3,300 పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే తాజాగా విరాట్ ఈ రికార్డును తన పేరు మీదకు మార్చుకున్నాడు.