విచిత్ర ఘటన.. రివ్యూ తీసుకోవాలా వద్దా అని బ్యాటర్‌ని అడిగిన కీపర్ రిజ్వాన్
అంతర్జాతీయ క్రికెట్‌లో విచిత్ర ప్రవర్తనలతో నిత్యం వార్తల్లోకి ఎక్కే జట్లలో పాకిస్తాన్(Pakistan) ముందు వరుసలో ఉంటుంది.
దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌లో విచిత్ర ప్రవర్తనలతో నిత్యం వార్తల్లోకి ఎక్కే జట్లలో పాకిస్తాన్(Pakistan) ముందు వరుసలో ఉంటుంది. గతంలో ఒకే బంతి వెంట ఐదుగురు ప్లేయర్లు పరిగెత్తడం, చేతులోకి వచ్చిన బంతిని వదిలిపెట్టడం, ఫ్రీ హిట్ బంతికి అవుట్ కోసం అప్పీల్ చేయడం వంటి ప్రవర్తనలతో నిత్యం మెమర్ల చెతిలో పాకిస్థాన్(Pakistan) జట్టు ప్లేయర్లు ట్రోల్స్ ఎదుర్కొంటారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న ఆడమ్ జంపా(Zampa)తో పాకిస్థాన్ జట్టు వికెట్ కీపర్ రిజ్వాన్(Rizwan) సంబాషన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో నసీమ్ బౌలింగ్ వేయగా బ్యాటింగ్ చేస్తున్న జంపా అప్పర్ కట్ట కొట్టబోయాడు. కానీ బాల్ మిస్ అయ్యి.. వికెట్ కీపర్ రిజ్వాన్ చేతిలోకి వెల్లింది. అయితే బ్యాట్ కు తగిలిందని భావించిన రిజ్వాన్(Rizwan).. అవుట్ కోసం బిగ్గరగా అరవడం ఆ వీడియోలో కనిపించింది. అనంతరం వికెట్ల వద్దకు నడుచుకుంటూ వచ్చిన రిజ్వాన్ జంపాతో ఇలా అన్నాడు..
రిజ్వాన్: నువ్వు ఏదైనా విన్నావా?
జంపా: మీరు ప్రతిదానికి అప్పీల్ చేస్తున్నారా అని ప్రశ్నించాడు.?
రిజ్వాన్: నేను రివ్యూ తీసుకోవాలా అని అడిగాడు.
జంపా: అవును, మీరు రివ్యూ తీసుకోవచ్చు అన్నాడు. అనంతరం రిజ్వాన్ రివ్యూ తీసుకున్నాడు. DRS అనంతరం అంపైర్ దానిని నాటౌట్ అని ప్రకటించారు. దీంతో కెప్టెన్ రిజ్వాన్, అతని జట్టు నవ్వుకుంటూ వెనక్కి వెళ్లిపోయారు.