Cricket: వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్ రౌండర్

ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ( Mohammad Nabi) వన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల నుంచి రిటైర్మెంట్( retirement) తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Update: 2024-11-08 03:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ( Mohammad Nabi) వన్డే ఇంటర్నేషనల్ మ్యాచుల నుంచి రిటైర్మెంట్( retirement) తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వచ్చే సంవత్సరం పాకిస్తాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో తన చివరి మ్యాచ్ ఆడుతానని ఆయన ప్రకటించారు. 39 ఏళ్ల నబీ.. 2019లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. బెస్ట్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న నబీ 2009లో స్కాట్లాండ్‌పై తన ODI అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మొత్తం 165 మ్యాచ్‌లలో దేశానికి ప్రాతినిధ్యం వహించి.. 3549 పరుగులు చేయడమే కాకుండా.. బౌలింగ్‌లో 171 వికెట్లు సాధించాడు. కాగా నబీ(nabi) ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీ20 టోర్నమెంట్లకు అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పై మొదటి వన్డే మ్యాచ్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. అలాగే నబీ ఐపీఎల్ టోర్నమెంట్ లో కూడా అనేక జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే నబీ వచ్చే ఐపీఎల్(IPL) సీజన్లో అడతాడో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.


Similar News