కేన్ మామ అరుదైన రికార్డు.. తొలి కివీస్ ప్లేయర్‌గా..
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అరుదైన రికార్డును నెలకొల్పాడు.
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ బ్యాటర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో కేన్ మామ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్.. 7,684 పరుగుల ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో కివీస్ మాజీ బ్యాటర్ రాస్ టేలర్ రికార్డును అధిగమించాడు. రాస్ టేలర్ 112 టెస్ట్‌ల్లో 7, 683 పరుగులు చేశాడు.
కేన్ విలియమ్సన్ 92 టెస్ట్‌ల్లు 161 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకోవడం విశేషం. ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ 282 బంతుల్లో 12 ఫోర్లతో 132) సూపర్ సెంచరీతో న్యూజిలాండ్‌ను ఆదుకున్నాడు. 202/3 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన కివీస్.. కేన్ మామ సెంచరీతో రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగుల భారీ స్కోర్ చేసింది.