Joe Root : జో రూట్ జోరుకు..సచిన్ రికార్డు బ్రేక్

టెస్టు క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) దెబ్బకు దిగ్గజ బ్యాటర్ సచిన్ టెందూల్కర్(Sachin Tendulkar) టెస్టు రికార్డు ఒకటి తుడిచిపెట్టుకపోయింది.

Update: 2024-12-01 07:51 GMT
Joe Root : జో రూట్ జోరుకు..సచిన్ రికార్డు బ్రేక్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : టెస్టు క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) దెబ్బకు దిగ్గజ బ్యాటర్ సచిన్ టెందూల్కర్(Sachin Tendulkar) టెస్టు రికార్డు ఒకటి తుడిచిపెట్టుకపోయింది. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు (1630) చేసిన ఆటగాడిగా జోరూట్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్ తెందూల్కర్ (1625 పరుగులు) పేరిట ఉంది. న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో తొలి టెస్టు నాలుగో ఇన్నింగ్స్ లో రూట్ 23 పరుగులు చేయడం ద్వారా సచిన్ రికార్డును అధిగమించాడు. సచిన్ 60 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత అందుకోగా.. జో రూట్ కేవలం 49 ఇన్నింగ్స్ ల్లోనే ఈ రికార్డు సాధించడం విశేషం. జోరూట్ ఇప్పటివరకు 150 టెస్టులు ఆడి 12,777 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్ లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం జో రూట్ ఐదో స్థానంలో ఉన్నాడు. జోరూట్ జోరు చూస్తుంటే టెస్టు క్రికెట్ లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక రన్స్ 15,291 పరుగుల రికార్డును కూడా చేరుకునేలా కనిపిస్తున్నారు.

కాగా న్యూజిలాండ్ జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆదివారం 155/6 స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్.. 254 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిచెల్ (84; 167 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) ఆఖరి వికెట్ గా వెనుదిరిగాడు. 104పరుగు స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 12.4 ఓవర్లలోనే చేధించింది. జాకబ్ బెథెల్ (50*, 37 బంతుల్లో), బెన్ డకెట్ (27; 18 బంతుల్లో), జో రూట్ (23*: 15 బంతుల్లో) పరుగులు చేశారు.

Tags:    

Similar News