ఐసీసీ ప్రెసిడెంట్ పదవిపై కన్నేసిన జైషా.. పోటీ చేస్తే గెలుపు సులభమేనా?

ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. టెస్టులు, వన్డేలు, టీ20లలో సత్తా చూపిస్తోంది. అటు సీనియర్లతో కూడిన జట్టైనా, ఇటు జూనియర్లతో కూడిన జట్టైనా ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాయి.

Update: 2024-08-21 15:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. టెస్టులు, వన్డేలు, టీ20లలో సత్తా చూపిస్తోంది. అటు సీనియర్లతో కూడిన జట్టైనా, ఇటు జూనియర్లతో కూడిన జట్టైనా ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాయి. దీనికి ఇటీవల టీమిండియా సాధించిన టీ20 ప్రపంచకప్పే నిదర్శనం. ఈ క్రమంలోనే బీసీసీఐ ప్రెసిడెంట్ జైషాపై ఆసక్తికర వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే జైషా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్నాడని పాక్ సహా ఇతర దేశాల క్రీడాకారులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జైషా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) ప్రెసిడెంట్ కాబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, ప్రస్తుత ఐసీసీ ప్రెసిడెంట్ గ్రెగ్ బార్క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. దీంతో ఐసీసీ ప్రెసిడెంట్‌ పదవిపై జైషా గట్టి పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి ఐసీసీ ఎన్నికల ద్వారా కొత్త అధ్యక్షుడిని నియమించనున్నారు. ఐసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 27. జైషా నామినేషన్ దాఖలు చేస్తే సులభంగా అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఐసీసీ ప్రెసిడెంట్లుగా భారత్ నుంచి నలుగురు పనిచేశారు. అందులో జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్‌లు ఉన్నారు. ఇప్పుడు జైషా బరిలోకి దిగితే ఐదో వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కడం ఖాయం.

Tags:    

Similar News