ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన సిరాజ్.. ఏకంగా 13 స్థానాలు

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో సఫారీలను బెంబేలెత్తించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టాడు.

Update: 2024-01-10 18:19 GMT

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికాతో రెండో టెస్టులో సఫారీలను బెంబేలెత్తించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టాడు. ఏకంగా 13 స్థానాలను ఎగబాకాడు. ఐసీసీ బుధవారం టెస్టు ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్ తమ ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్నారు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. బుమ్రా ఒక్క స్థానం అధిగమించి 4వ ర్యాంక్‌కు చేరుకోగా.. జడేజా ఒక్క స్థానం కోల్పోయి 5వ ర్యాంక్‌కు పడిపోయాడు. ఇక, సిరాజ్ ఏకంగా 13 స్థానాలను వెనక్కినెట్టి 17వ ర్యాంక్‌లో నిలిచాడు. సౌతాఫ్రికాతో రెండో టెస్టులో బుమ్రా 8 వికెట్లు, సిరాజ్ 7 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తమ ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్నారు. విరాట్ కోహ్లీ మూడు స్థానాలను అధిగమించి 6వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. రోహిత్ శర్మ చాలా రోజుల తర్వాత టాప్-10లోకి వచ్చాడు. 4 స్థానాలను ఎగబాకిన అతను 748 రేటింగ్ పాయింట్స్‌తో 10వ ర్యాంక్‌లో నిలిచాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 

Tags:    

Similar News