బుమ్రాకు విశ్రాంతి.. రాహుల్ దూరం

రాంచీ టెస్టుకు టీమ్ ఇండియా స్టార్ ఆటగాళ్లు జస్ప్రిత్ బుమ్రా, కేఎల్ రాహుల్ దూరంగా ఉండనున్నారు.

Update: 2024-02-20 17:45 GMT

దిశ, స్పోర్ట్స్ : రాంచీ టెస్టుకు టీమ్ ఇండియా స్టార్ ఆటగాళ్లు జస్ప్రిత్ బుమ్రా, కేఎల్ రాహుల్ దూరంగా ఉండనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం వెల్లడించింది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. దీంతో అతని స్థానంలో మూడో టెస్టుకు జట్టు నుంచి రిలీజ్ చేసిన మరో పేసర్ ముకేశ్ కుమార్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. నాలుగో టెస్టులో ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్‌లలో ఒక్కరు బుమ్రా స్థానాన్ని భర్తీ చేయనున్నారు. మరోవైపు, కేఎల్ రాహుల్ నాలుగో టెస్టుకు కూడా దూరమయ్యాడు. తొడకండరాల గాయం నుంచి కోలుకున్న అతను ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే అతను వైజాగ్, రాజ్‌కోట్ టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే. రాంచీ టెస్టుకు అందుబాటులోకి వస్తానడి వార్తలు వచ్చాయి. అయితే, ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అతను రాంచీ టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని బోర్డు తెలిపింది. ఫిట్‌నెస్ సాధిస్తే ధర్మశాల టెస్టులో జట్టుతో కలుస్తాడని చెప్పింది. మరోవైపు, భారత్, ఇంగ్లాండ్ జట్లు మంగళవారం రాంచీకి చేరుకున్నాయి. బీసీసీఐ ఏర్పాటు చేసిన స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు రాంచీకి చేరుకున్నారు. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. రాంచీ వేదికగా ఈ నెల 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు జరగనుంది.


Tags:    

Similar News