ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తోన్న బీసీసీఐ

ఐసీసీ(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) చైర్మన్‌గా జైషా ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది.

Update: 2024-08-27 15:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) చైర్మన్‌గా జైషా ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. డిసెంబర్ 1, 2024 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఐసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా జైషా రికార్డు క్రియేట్ చేశారు. ప్రస్తుత చైర్మన్ బార్‌ క్లే పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌లో ముగియనుంది. మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ఆయన విముఖత చూపడంతో జైషా ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఎవరైనా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నిక కావాలంటే బోర్డులోని 16 మంది సభ్యుల్లో కనీసం 9 మంది మద్దతు అవసరం. అయితే జై షాకు ఐసీసీ బోర్డులోని 16 మంది సభ్యుల్లో 16 మంది మద్దతు లభించింది. కాగా, ప్రస్తుతం జైషా బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే, ప్రస్తుతం బీసీసీఐ ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తోందని పలువురు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.


Similar News