స్కీట్ షూటింగ్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. తొలిసారిగా రెండు పతకాలు

కజకస్తాన్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్‌ఎస్‌ఎఫ్) వరల్డ్ కప్‌లో భారత చరిత్ర సృష్టించింది.

Update: 2023-05-23 13:16 GMT

న్యూఢిల్లీ: కజకస్తాన్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్‌ఎస్‌ఎఫ్) వరల్డ్ కప్‌లో భారత చరిత్ర సృష్టించింది. షూటింగ్ వరల్డ్ కప్‌లో తొలిసారిగా స్కీట్ ఈవెంట్‌లో రెండు పతకాలు గెలుచుకుంది. భారత మహిళా స్కీట్ షూటర్స్ గణేమత్ సెఖోన్ రజతం గెలుచుకోగా.. దర్శన రాథోర్ కాంస్యం సాధించింది. కాగా, గణేవట్ సెఖోన్ తృటిలో స్వర్ణాన్ని కోల్పోయింది. గోల్డ్ మెడల్ రౌండ్‌లో 60 షాట్లు ముగిసే సరికి కజకస్తాన్ షూటర్ అస్సెం ఓరిన్‌బే‌తో కలిసి ఆమె 50 పాయింట్లతో సమంగా నిలిచింది.

షూట్ ఆఫ్‌లో భారత షూటర్ రెండు టార్గెట్‌లో ఒకటి మిస్ చేయడంతో రజతంతో సరిపెట్టింది. కజకస్తాన్ రెండింటిని షూట్ చేసి స్వర్ణం గెలుచుకుంది. అలాగే, మరో భారత షూటర్ దర్శన రాథోర్ 39 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించింది. వరల్డ్ కప్‌‌లో గణేమత్‌కు ఇది రెండో వ్యక్తిగత పతకం కాగా.. సీనియర్ లెవల్‌లో దర్శనకు ఇదే తొలి మెడల్.

Tags:    

Similar News