కైరో: ఈజిఫ్ట్‌లో జరుగుతున్న ఐఎస్‌ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత షూటర్ల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు, ఒక కాంస్యం ఉండగా.. మంగళవారం మరో స్వర్ణం, కాంస్య పతకాలు చేరాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల ఈవెంట్‌లో భారత షూటర్ రుద్రాంక్ష్ పాటిల్ విజేతగా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ షూటర్ ఉల్బ్రిచ్ మాక్సిమిలియన్ 8-16 తేడాతో రుద్రాంక్ష్ విజయం సాధించి స్వర్ణపతకం సొంతం చేసుకున్నాడు.
అలాగే, అదే ఈవెంట్‌లో మహిళల కేటగిరీలో తిలోత్తమ సేన్ కాంస్యం సాధించింది. ర్యాంకింగ్ రౌండ్‌లో తిలోత్తమ 262 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. 0.1తో ఫైనల్ మ్యాచ్‌కు దూరమైన ఆమె బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టింది. 14ఏళ్ల తిలోత్తమ సీనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌లో పతకం గెలిచిన యంగెస్ట్ భారత షూటర్‌గా నిలిచింది. టోర్నీలో ఐదో రోజు భారత్ 5 పతకాలతో మెడల్ స్టాండింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నది.
The first final of the third day at the ISSF World Cup R&P in Cairo, EGY 🇪🇬 started with 10m Air Rifle Men with the following results
— ISSF (@issf_official) February 21, 2023
🥇PATIL Rudrankksh, IND 🇮🇳
🥈 ULBRICH Maximilian, GER 🇩🇪
🥉MARICIC Miran, CRO 🇭🇷#sports #sportevent #sport #atleta #athlete #athletes pic.twitter.com/SAbPnE23Cu