బ్యాటర్లు భయపడేలా బౌలింగ్ చెయ్.. యువ పేసర్‌కు ఇషాంత్ శర్మ సలహా

Update: 2023-03-21 13:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కాశ్మీర్ పేసర్, టీమ్ ఇండియా యువ సంచలనం ఉమ్రాన్ మాలిక్‌కి భారత మాజీ పేసర్ ఇషాంత్ శర్మ అతనికి కీలకమైన సలహా ఇచ్చాడు. ఉమ్రాన్ ముఖ్యంగా తన పేస్ బౌలింగ్ పైన మాత్రమే ఫోకస్ పెట్టాలని చెప్పాడు. ఇలా 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయడం వల్ల బ్యాటర్లు తడబడతారని చెప్పాడు. కాబట్టి 150 లేదా 160 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగలిగితే.. దానిపైనే ఉమ్రాన్ ఫోకస్ పెట్టాలని ఇషాన్ సూచించాడు.

పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంపై ఉమ్రాన్ ఫోకస్ పెట్టాల్సి ఉంది. మిడిల్ ఓవర్లలో రాణిస్తున్నా.. పవర్‌ప్లే, డెత్ ఓవర్లలోనే ఉమ్రాన్ ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. కాబట్టి ఈ విషయంపై కనుక అతను ఫోకస్ పెడితే కచ్చితంగా వరల్డ్ కప్‌లో కూడా అతనికి చోటు దక్కే ఛాన్స్ ఉందని ఇషాన్ అభిప్రాయపడ్డాడు. గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడగా.. అతను ఏకంగా 22 వికెట్లు తీసుకుని సత్తా చాటాడు. దీంతో అతనికి భారత జట్టు నుంచి కూడా పిలుపొచ్చింది.

Tags:    

Similar News