ఆ మ్యాచ్‌లో టీమిండియా నా వల్లే ఓడిపోవడంతో నెల రోజులు ఏడ్చాను :Ishant Sharma

పదేళ్ల కిందట జరిగిన ఓ విషయాన్ని టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ తాజాగా గుర్తు చేసుకున్నాడు.

Update: 2023-02-27 11:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల కిందట జరిగిన ఓ విషయాన్ని టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ తాజాగా గుర్తు చేసుకున్నాడు.2013లో ఆస్ట్రేలియా జట్టు భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఇషాంత్ నిరాశ పరిచాడు. మొహాలీలో ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో అతని పేలవ బౌలింగ్ కారణంగా భారత్ ఓడిపోయింది. తన వల్లే భారత్ ఓడిపోయిందని అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దాదాపు నెల రోజుల పాటు ఓటమి బాధను మర్చిపోలేక ఏడుస్తూనే ఉన్నానని ఇషాంత్ తెలిపాడు. ఈ సమయంలో ధోనీ, శిఖర్ ధవన్ తనకు సహాయం చేశారని చెప్పాడు. పదేళ్ల కిందట జరిగిన ఈ విషయాన్ని ఇషాంత్ తాజాగా గుర్తు చేసుకున్నాడు.

మొహాలీలో జరిగిన 2013 మ్యాచ్. అంతకంటే దారుణమైన పరిస్థితి ఉంటుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆ సమయంలో నేను తీవ్రంగా కలత చెందా. జట్టు ఓడిపోవడానికి నేనే కారణం కావడం తో నాకు నిద్ర పట్టలేదని తెలిపాడు. దాదాపు ఒక నెల పాటు నేను ప్రతిరోజూ ఆమెకు కాల్ చేసి నా వల్ల జట్టు ఓడిపోయిందని ఫోన్‌లో ఏడ్చేవాడిని. విషయం తెలుసుకున్న ధోనీ, ధవన్‌ నా గదికి వచ్చారు. నువ్వు బాగా ఆడుతున్నావు అంటూ నాలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. చివరగా ఇషాంత్ 2021లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

Tags:    

Similar News