Irani Cup: ఇరానీ కప్ విజేతగా ముంబై..15వ సారి టైటిల్ కైవసం
ఉత్తరప్రదేశ్(UP)లోని లక్నో(Lucknow) వేదికగా రెస్ట్ ఆఫ్ ఇండియా(Rest of India), ముంబై(Mumbai) మధ్య 5 రోజుల పాటు జరిగిన ఇరానీ కప్(Irani Cup) మ్యాచ్ డ్రాగా ముగిసింది.
దిశ, వెబ్‌డెస్క్:ఉత్తరప్రదేశ్(UP)లోని లక్నో(Lucknow) వేదికగా రెస్ట్ ఆఫ్ ఇండియా(Rest of India), ముంబై(Mumbai) మధ్య 5 రోజుల పాటు జరిగిన ఇరానీ కప్(Irani Cup) మ్యాచ్ డ్రాగా ముగిసింది.అయితే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 121 పరుగుల లీడ్ కారణంగా ముంబై ఇరానీకప్ విజేతగా నిలిచింది.దీంతో 15వ సారి ట్రోఫీ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది.ఈ మ్యాచులో తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 537 పరుగులు చేసింది. ముంబై తరపున మొదటి ఇన్నింగ్స్‌లో యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) అజేయంగా 222 పరుగులు చేశాడు.అతనికి తోడు రహానే(Rahane) 97,అయ్యర్(Iyer) 57 పరుగులతో రాణించడంతో ముంబై భారీ స్కోర్ సాధించింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.ఇక ముంబై రెండో ఇన్నింగ్స్‌లో ఐదవ రోజు ఆట ముగిసే సమయానికి 329/8తో నిలిచింది.ఈ మ్యాచులో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో డ్రాగా ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగుల లీడ్ సంపాదించిన ముంబై ఇరానీ కప్ టైటిల్ గెలుచుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టిన ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(Man of the Match) అవార్డు లభించింది.కాగా 27 ఏళ్ల తర్వాత ముంబై ఇరానీ కప్ విజేతగా నిలవడం విశేషం. చివరి సారి ఆ జట్టు 1997-98లో ఈ ట్రోఫీ గెలుచుకుంది.కాగా ఇరానీ కప్ లో కేవలం ఒకే మ్యాచ్ ఆడుతారు. మ్యాచ్ డ్రాగా ముగిస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా విజేతను ప్రకటిస్తారు.