ఐపీఎల్ విలువ ఎంతో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Update: 2024-06-12 16:37 GMT

దిశ, స్పోర్ట్స్ : ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2008లో ప్రారంభమైన భారత టీ20 లీగ్ తన బ్రాండ్‌ వాల్యూను పెంచుకుంటూ వస్తోంది. తాజాగా అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ హౌలిహాన్ లోకీ ఐపీఎల్ బిజినెస్ వాల్యూ రూ. లక్షా 35 వేలు కోట్లు అని అంచనా వేసింది. హౌలిహాన్ లోకీ నివేదిక ప్రకారం.. ఏడాది కాలంలో ఐపీఎల్ బిజినెస్ వాల్యూ 6.5 శాతం పెరిగి రూ. లక్షా 35 కోట్లకు చేరింది. అలాగే, బ్రాండ్ వాల్యూ 6.3 శాతం పెరిగింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను టాటా గ్రూపు ఐదేళ్లకు(2024-28)గానూ రూ. 2,500 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. గత ఒప్పందం(సీజన్‌కు రూ. 335 కోట్లు) కంటే టాటా గ్రూపు ఒక్కో సీజన్‌కు 50 శాతం ఎక్కువ చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలోనే లీగ్ బిజినెస్, బ్రాండ్ వాల్యూ పెరిగినట్టు నివేదిక తెలిపింది.

అలాగే, చెన్నయ్ సూపర్ కింగ్స్(231 మిలియన్ డాలర్లు) మోస్ట్ బ్రాండ్ వాల్యూ ఫ్రాంచైజీ అని పేర్కొంది. సీఎస్కే గతేడాది పోలిస్తే 9 శాతం వాల్యూను పెంచుకుంది. బెంగళూరు(227 మిలియన్ డాలర్లు) రెండో స్థానంలో నిలిచింది. ఐపీఎల్-17 విజేతగా నిలిచిన కోల్‌కతా అత్యధికంగా 19.30 శాతం వృద్ధి సాధించింది. కోల్‌కతా(216 మిలియన్ డాలర్లు)తో మూడో స్థానంలో నిలువగా.. ఈ సీజన్ కంటే ముందు హయ్యెస్ట్ బ్రాండ్ వాల్యూ కలిగి ఉన్న ముంబై ఇండియన్స్(204 మిలియన్ డాలర్లు) నాలుగో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్(133 మిలియన్ డాలర్లు), హైదరాబాద్(132 మిలియన్ డాలర్లు), ఢిల్లీ(131 మిలియన్ డాలర్లు), గుజరాత్(124 మిలియన్ డాలర్లు), పంజాబ్(1.1 మిలియన్ డాలర్లు), లక్నో(91 మిలియన్ డాలర్లు) ఉన్నాయి. 


Similar News