ఆరంభం అదిరింది.. ఫస్ట్ మ్యాచ్ మనదే
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు శుభారంభాన్ని అందించారు.

- చెలరేగిన సన్‌రైజర్స్ బ్యాటర్లు
- సెంచరీతో కదం తొక్కిన ఇషాన్ కిషన్
- రాణించిన హెడ్, క్లాసెన్, నితీశ్ రెడ్డి
- రాజస్థాన్‌పై 44 పరుగుల తేడాతో విజయం
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ సీజన్ 18ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుత విజయంతో ఆరంభించింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 287 పరుగులు భారీ టార్గెట్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ జట్టు ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1)ను సమర్‌జీత్ సింగ్ తక్కువ స్కోరుకే పెవీలియన్ పంపించాడు. ఇక కెప్టెన్ రియాన్ పరాగ్ (4) ఒత్తిడిని జయించలేక వికెట్ పారేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన నితీశ్ రాణా (11) కూడా విఫలమవడంతో రాజస్థాన్ జట్టు తీవ్రమైన కష్టాల్లో పడింది. అయితే మరో ఓపెనర్ సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్ కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ బౌండరీలు, సిక్సులు బాదుతూ రాజస్థాన్ రన్‌రేట్ తగ్గకుండా పరుగులు సాధించారు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు ఏకంగా 111 పరుగులు జత చేసింది. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని హర్షల్ పటేల్ విడదీశారు. సంజూ శాంసన్ (66)ను పటేల్ పెవీలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కాసేపటికే ధ్రువ్ జురెల్ (70) కూడా ఔటయ్యాడు. ఒక వైపు కావల్సిన రన్‌రేట్ పెరుగుతుండటంతో షిమ్రోన్ హిట్‌మెయర్ (42), శుభమ్ దూబే (34) ధాటిగా ఆడినా జట్టును కాపాడలేక పోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సన్‌రైజర్స్ జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిమర్‌జీత్ సింగ్, హర్షల్ పటేల్ తలా రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ, ఆడమ్ జంపా చెరో వికెట్ తీశారు. అద్భుతమైన సెంచరీ చేసిన ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
చెలరేగిన సన్‌రైజర్స్..
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌లు శుభారంభాన్ని అందించారు. రాజస్థాన్ బౌలర్లను మొదటి నుంచి చితకబాదారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు మూడు ఓవర్లలోనే 45 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఐదు బౌండరీలు బాది మంచి ఊపు మీద ఉన్న అభిషేక్ శర్మ(24)ను మహీశ్ తీక్షణ అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎప్పటిలాగే తన దూకుడైన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ కలిసి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోర్‌ను పరుగులు పెట్టించారు. ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. అయితే దూకుడుగా ఉన్న హెడ్‌ను తుషార్ దేశ్‌పాండే అవుట్ చేశాడు.ఆ తర్వాత వచ్చిన నితీశ్ రెడ్డి (30), క్లాసెన్ (34) కూడా చెలరేగి ఆడారు. ఆఖర్లో భారీ షాట్ల కోసం ప్రయత్నించి అనికెత్ వర్మ (7), అభినవ్ మనోహర్ (0) అవుటయ్యారు. అయితే మరో ఎండ్‌లో ఉన్న ఇషాన్ కిషన్ మాత్రం తన దూకుడు తగ్గించలేదు. ఈ క్రమంలో కేవలం 47 బంతుల్లో 106 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్పులు, 11 ఫోర్లు ఉండటం గమనార్హం. ఇన్నింగ్స్ చివరి వరకు కిషన్ నిలబడటంతో సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 286 పరుగుల భారీ స్కోర్ సాధించింది. తుషార్ దేశ్‌పాండే 3, మహీష తీక్షణ 2 వికెట్లు తీయగా సందీప్ శర్మకు ఒక వికెట్ లభించింది.
స్కోర్ బోర్డు :
సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ (సి) యశస్వి జైస్వాల్ (బి) మహీష తీక్షణ 24, ట్రావిస్ హెడ్ (సి) హెట్‌మెయర్ (బి) తుషార్ దేశ్‌పాండే 67, ఇషాన్ కిషన్ 106 నాటౌట్, నితీశ్ కుమార్ రెడ్డి (సి) యశస్వి జైస్వాల్ (బి) మహీష తీక్షణ 30, క్లాసెన్ (సి) రియాన్ పరాగ్ (బి) సందీప్ శర్మ 34, అనికెత్ వర్మ (సి) జోఫ్రా ఆర్చర్ (బి) తుషార్ దేశ్‌పాండే 7, అభినవ్ మనోహర్ (సి) రియాన్ పరాగ్ (బి) తుషార్ దేశ్‌పాండే 0, కమ్మిన్స్ 0 నాటౌట్, ఎక్స్‌ట్రాలు 18; మొత్తం 286/6 (20 ఓవర్లు)
వికెట్ల పతనం : 45-1, 130-2, 202-3, 258-4, 279-5, 279-6
బౌలింగ్ : ఫజల్లాఖ్ ఫారూఖీ (3-0-49-0), మహీష తీక్షణ (4-0-52-2), జోఫ్రా ఆర్చర్ (4-0-76-0), సందీప్ శర్మ (4-0-51-1), నితీష్ రాణా (1-0-9-0), తుషార్ దేశ్‌పాండే (4-0-44-3)
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్ (సి) అభినవ్ మనోహర్ (బి) సిమర్‌జీత్ సింగ్ 1, సంజూ శాంసన్ (సి) క్లాసెన్ (బి) హర్షల్ పటేల్ 66, రియాన్ పరాగ్ (సి) కమ్మిన్స్ (బి) సిమర్‌జీత్ సింగ్ 4, నితీశ్ రాణా (సి) కమ్మిన్స్ (బి) మహ్మద్ షమీ 11, ధ్రువ్ జురేల్ (సి) ఇషాన్ కిషన్ (బి) ఆడమ్ జంపా 70, షిమ్రోన్ హిట్‌మెయర్ (సి) అభినవ్ మనోహర్ (బి) హర్షల్ పటేల్ 42, శుభమ్ దూబే 34 నాటౌట్, జోఫ్రా ఆర్చర్ 1 నాటౌట్, ఎక్స్‌ట్రాలు 13; మొత్తం 242/6(20 ఓవర్లు)
వికెట్ల పతనం: 20-1, 24-2, 50-3, 161-4, 161-5, 241-6
బౌలింగ్ : మహ్మద్ షమీ (3-0-33-1), సిమ్రాన్‌జీత్ సింగ్ (3-0-46-2), పాట్ కమ్మిన్స్ (4-0-60-0), అభిషేక్ శర్మ (2-0-17-0), ఆడమ్ జంపా (4-0-48-1), హర్షల్ పటేల్ (4-0-34-2)