IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్‌కు బిగ్ షాక్.. గంభీర్ సంచలన నిర్ణయం..!

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.

Update: 2023-08-18 13:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్.. ఈ ఫ్రాంచైజీని వదిలేస్తున్నాడని సమాచారం. ఈ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ ఇటీవలే ఈ టీంను వదిలేశాడు. దీంతో అతని స్థానంలో ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్‌ను లక్నో యాజమాన్యం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే తాజాగా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ను తమ స్ట్రాటజిక్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. ఇలాంటి సమయంలో వచ్చే ఐపీఎల్‌కు ముందే గంభీర్ ఈ ఫ్రాంచైజీని వదిలేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

2022లో ఈ టీం జర్నీ మొదలైనప్పటి నుంచి గంభీర్.. లక్నో ఫ్రాంచైజీతోనే ఉన్నాడు. టీం కెప్టెన్ కేఎల్ రాహుల్ తదితరుల కంటే గంభీర్ ప్రెజెన్స్ ఈ టీంలో ఎక్కువగా కనిపించేది. ఆడిన రెండు ఐపీఎల్ సీజన్లలో ప్లేఆఫ్స్ చేరడంతో ఈ టీం ఫ్యాన్ బేస్ కూడా బాగా పెరిగింది. కానీ రెండు సార్లూ ఈ టీం ఫైనల్ చేరకుండానే వెనుతిరిగింది. ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం.. లక్నో టీం మేనేజ్‌మెంట్, గంభీర్ మధ్య పరిస్థితి బాగలేదని తెలుస్తోంది. దీంతో గంభీర్ కూడా ఈ ఫ్రాంచైజీని వదిలేసి వెళ్లిపోయే పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది. 'ఆండీ ఫ్లవర్ తర్వాత గౌతమ్ గంభీర్ ఈ ఐపీఎల్ ఫ్రాంచైజీని వదిలేస్తున్నాడు. ఈ విషయంలో ఇంతకు మించి ఏం చెప్పలేం' అని లక్నో టీంకు చెందిన ఒక వ్యక్తి తెలిపాడు. అంతేకాదు, ఇప్పుడు టీంతో చేరిన ఎమ్మెస్కే ప్రసాద్‌తో గతంలో గంభీర్‌కు గొడవలు ఉన్నాయి. ఇది కూడా గంభీర్ నిష్క్రమణకు ఒక కారణం అయ్యుండొచ్చని తెలుస్తోంది.


Similar News