దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 'RCB అన్‌బాక్స్' ఈవెంట్ పేరుతో RCB ఒక ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా క్రిస్ గేల్ తన తొలి ఐపీఎల్ సెంచరీని గుర్తుచేసుకుంటూ.. ఐపీఎల్‌లో తొలి సెంచరీ సాధించడంలో కోహ్లీ తనకు ఎలా సహకరించాడో చెప్పాడు. ఐపీఎల్2లో తన మెుదటి సెంచరీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన నా తొలి మ్యాచ్‌లో నేను 98 రన్స్ వద్ద ఉన్నాను.
సెంచరీకి రెండు పరుగుల దూరం ఉన్నప్పుడు.. కోహ్లీ రన్స్ తీయకుండా ఓవర్ కంప్లీట్ చేసి.. నాకు స్ట్రైక్ ఇవ్వడంతో నేను నా తొలి ఐపీఎల్ సెంచరీ సాధించాను అని గేల్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ 18వ ఓవర్ తొలి బంతికి విరాట్ ఫోర్ బాదాడు. ఆ తర్వాత RCB విజయానికి 2 పరుగులు మాత్రమే కావాలి. గేల్ నాన్-స్ట్రైక్‌లో 98 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. కోహ్లీ రన్స్ తీయకుండా ఓవర్ కంప్లీట్ చేయడంతో తర్వాత ఓవర్ తొలి బాల్‌కే ఫోర్ కొట్టి తన జట్టుకు విజయాన్ని అందిచడంతో పాటుగా గేల్ ఐపీఎల్‌లో తొలి సెంచరీని కూడా పూర్తి చేశాడు.