ICC ODI WC 2023: అందుకే అతడిని ఎంపిక చేయలేదు.. పాక్ చీఫ్‌ సెలక్టర్‌

భారత్‌ వేదికగా అక్టోబరు 5న మొదలుకానున్న ఐసీసీ ఈవెంట్‌కు పాక్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించిన జట్టులో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీంకు చోటు దక్కలేదు.

Update: 2023-09-22 12:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌ వేదికగా అక్టోబరు 5న మొదలుకానున్న ఐసీసీ ఈవెంట్‌కు పాక్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించిన జట్టులో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీంకు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్‌ సెలక్టర్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ఇమాద్‌ వసీంను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. చాలా రోజులుగా ఇమాద్‌ వన్డేలు ఆడటం లేదు. సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలనుకున్న వాళ్లు ఎవరైనా సరే కచ్చితంగా దేశవాళీ క్రికెట్‌లో తమను తాము నిరూపించుకోవాల్సిందే.

డొమెస్టిక్‌ క్రికెట్‌లో ప్రదర్శనల ఆధారంగానే జాతీయ జట్టు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అదే మెయిన్‌ క్రైటీరియా’’ అని ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ స్పష్టం చేశాడు. కాగా వరల్డ్‌కప్‌నకు ప్రకటించిన జట్టులో నసీం షా స్థానంలో హసన్‌ అలీ రీఎంట్రీ ఇస్తుండగా.. మహ్మద్‌ వసీం జూనియర్‌ నాలుగో సీమర్‌గా చోటు సంపాదించాడు. ఇప్పటి వరకు పాక్‌ తరఫున 55 వన్డేలు ఆడిన ఇమాద్‌.. 986 పరుగులు చేయడంతో పాటు.. 44 వికెట్లు పడగొట్టాడు.


Similar News