ఈ సారి టీ-20 వరల్డ్ కప్ ఆ జట్టుదే.. తేల్చిచెప్పిన పాక్ మాజీ క్రికెటర్

అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యమిస్తో్న్న టీ-20 వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. ఫొట్టి ఫార్మాట్ లీగ్‌లో ఇప్పటికే సూపర్-8 రౌండ్

Update: 2024-06-26 10:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యమిస్తోన్న టీ-20 వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. ఫొట్టి ఫార్మాట్ లీగ్‌లో ఇప్పటికే సూపర్-8 రౌండ్ ముగిసింది. నాలుగు జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఇండియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘానిస్తాన్ టీమ్స్ సెమీస్‌ రేస్‌లో తలపడేందుకు రెడీ అయ్యాయి. సెమీస్-1లో సౌతాఫ్రికా, ఆప్ఘానిస్తాన్ తలపడనుండగా, సెమీస్-2లో ఇండియా, ఇంగ్లాండ్ పోటీ పడనున్నాయి. ఈ క్రమంలో ఈ సారి టీ-20 వరల్డ్ కప్ విజేతపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన ఓ స్పోర్ట్స్ ఛానల్‌తో మాట్లాడుతూ.. ఈ సారి టీ-20 వరల్డ్ కప్ విజేతగా భారత నిలుస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ టోర్నీ ప్రారంభం నుండి టీమిండియా ఆట తీరే అందుకు నిదర్శనమని అన్నారు. టీ-20 వరల్డ్ కప్ గెలిచే 100 శాతం అర్హత భారత్‌కే ఉందన్నారు. ఈ సారి టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని తాను కోరుకుంటున్నానని అక్తర్ తెలిపారు. వాస్తవానికి రోహిత్ శర్మ వన్డే వరల్డ్ కప్ గెలవాల్సిందని, దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓటమి పాలైందన్నారు. ఈ టీ-20 వరల్డ్ కప్‌లోనూ భారత్ అద్భుతంగా అడుతోందని.. ఆ జట్టే ప్రపంచ కప్ గెలుస్తోందని జోస్యం చెప్పారు. వరల్డ్ కప్ గెలిచిందుకు కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా అర్హుడని కొనియాడారు. కాగా, ఈ నెల 27వ తేదీన సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో టీమిండియా తలపడనుంది. 


Similar News