పారిస్ ఒలింపిక్స్‌కు మీరాబాయి చాను అర్హత
భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్, టోక్యో సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.
దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్, టోక్యో సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. థాయిలాండ్‌లో సోమవారం జరిగిన ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనడం ద్వారా ఆమె ఒలింపిక్ బెర్త్‌ను కన్ఫార్మ్ చేసుకుంది. తుంటి గాయం కారణంగా దాదాపు ఆరు నెలలు ఆటకు దూరమైన ఆమె కోలుకున్న తర్వాత పాల్గొన్న తొలి టోర్నీ ఇదే. 49 కేజీల కేటగిరీలో గ్రూపు బిలో సత్తాచాటిన మీరాబాయి మొత్తం 184 కిలోలు(స్నాచ్‌లో 81 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 103 కేజీలు) ఎత్తి మూడో స్థానంలో నిలిచింది. ఐడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో 2వ ర్యాంక్‌తో ఆమె ఒలింపిక్ బెర్త్‌ను సాధించింది. దీంతో భారత్ నుంచి పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఏకైక వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి నిలిచింది. ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఆమెకు ఇది మూడోసారి.