INDvsAUS: టీమిండియాపై ఆస్ట్రేలియా ఘన విజయం

మొహాలీలో వేదికగా జరిగిన ఇండియా vs ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరితోకి దిగిన ఆస్ట్రేలియా

Update: 2022-09-20 17:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: మొహాలీలో వేదికగా జరిగిన ఇండియా vs ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కామెరాన్ గ్రీన్(61), మాథ్యూ వేడ్(45), స్టీవ్ స్మిత్(35) మెరుపు ఇన్నింగ్స్ ఇడటంతో ఆసీస్ గెలుపు సునాయాసమైంది.

టాస్ ఓడి.. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కెప్టెన్ రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (2) వరుసగా నిరాశ పరిచారు. ఆ తర్వాత సూర్య, కేఎల్ జోడీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. మొత్తంగా కేఎల్ రాహుల్ (55), సూర్యకుమార్ యాదవ్ (46), హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 71 నాటౌట్) అద్భుతంగా ఆడారు. దీంతో భారత జట్టు మెరుగైన స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు చేసింది.

దీంతో 209 పరుగుల భారీలో లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఆరోన్ ఫించ్ (22), కామెరూన్ గ్రీన్ (61) అద్భుతమైన ఆరంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ (35) కూడా రాణించాడు. చివరల్లో మాథ్యూ వేడ్ (45 నాటౌట్), టిమ్ డేవిడ్ (18) భారీ షాట్లతో విరుచుకుపడి విజయాన్ని భారత్‌కు దూరం చేశారు. దీంతో ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 211 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3, ఉమేష్ యాదవ్ 2, చాహల్ ఒక వికెట్ తీసుకున్నారు.

Tags:    

Similar News