IND vs AUS 2nd ODI : ఆసీస్‌తో రెండో వన్డే.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్!
వన్డే ప్రపంచకప్‌కు ముండు ఆస్ట్రేలియాతో జరగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది.
దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచకప్‌కు ముండు ఆస్ట్రేలియాతో జరగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది. ఈ సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో టీమిండియా అదరగొట్టింది. ఈ విజయంతో వన్డేల్లో నెం1 జట్టుగా భారత్ అవతరించింది. ఈ సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఆదివారం(సెప్టెంబర్ 24) ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు జల్లే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం రోజు మొత్తం ఆకాశం మేఘావృతమై ఉంటుందని పలు నివేదికలు వెల్లడించాయి.
తుది జట్లు(అంచనా)
భారత్:
శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ప్రసిద్ద్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ
ఆస్ట్రేలియా:
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, పాట్ కమ్మిన్స్(కెప్టెన్), సీన్ అబాట్, ఆడమ్ జంపా