ఇండోర్ పిచ్‌కు ఐసీసీ ‘POOR’ రేటింగ్..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది.
ఇండోర్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టు మూడు రోజుల్లోనే ముగిసింది.మూడో రోజు తొలి సెషన్‌లోనే ఆస్ట్రేలియా లక్ష్యాన్ని ఛేదించింది. రెండు రోజుల్లోనే ఈ పిచ్ 30 వికెట్లు కూలాయి. అందులో 26 వికెట్లు స్పిన్నర్లే తీయగా.. పేసర్లకు 4 వికెట్లు మాత్రమే దక్కాయి. గురువారం ఈ పిచ్‌కు ఐసీసీ పూర్ రేటింగ్ ఇచ్చింది.
పిచ్ అత్యంత నాసిరకంగా ఉందని తేల్చడంతోపాటు హోల్కర్ స్టేడియానికి మూడు డీ మెరిట్ పాయింట్స్ విధించింది. మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ అందజేసిన పిచ్ అండ్ ఔట్‌ఫీల్డ్ మానిటరింగ్ నివేదిక ప్రకారం ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ‘పిచ్ చాలా డ్రైగా ఉంది. బంతికి బ్యాటుకు మధ్య సమతుల్యత లేదు. ఆరంభం నుంచి స్పిన్నర్లకే అనుకూలించింది. పేస్‌కు ఎలాంటి సహకారం అందలేదు. బంతి బౌన్స్ కూడా అవ్వలేదు’ అని క్రిస్ బ్రాడ్ తెలిపారు.