Olympics: భారత రెజ్లర్‌పై అనర్హత వేటు.. అస్వస్థతకు గురైన వినేశ్ ఫొగట్‌

పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కేజీల కేటగిరీలో భారత రెజ్లర్‌ వినేశ్ ఫొగట్‌ సెమీ ఫైనల్ మ్యాచులో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Update: 2024-08-07 08:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కేజీల కేటగిరీలో భారత రెజ్లర్‌ వినేశ్ ఫొగట్‌ సెమీ ఫైనల్ మ్యాచులో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ఈ రోజు ఫైనల్ మ్యాచ్ ఉండటంతో మ్యాచ్కు ముందు ఆమె ఓవర్ వెయిట్ కారణంగా అనర్హురాలిగా ప్రకటించారు. కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా వినేష్ ఫోగట్ పై వేటు పడింది. అయితే రాత్రే బరువు చూసుకున్న రెజ్లర్ తాను పోటీ చేసే బరువు కంటే అధికంగా ఉండటం గమనించింది. దీంతో కొచ్ సారధ్యంతో రాత్రి మొత్తం బరువు తగ్గేందుకు కసరత్తు చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఉదయం ఆమె పై అనర్హత వేటు పడిన కొద్ది సేపటికే వినేశ్ ఫొగట్‌ అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. డీ హైడ్రేషన్ కారణంగా ఆరోగ్యం క్షీణించినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ప్రధాని మోడీ పీటీ ఉష తో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే భారత రెజ్లర్‌ వినేశ్ ఫొగట్‌ అనర్హతపై వెంటనే నిరసన వ్యక్తం చేయాలని ప్రధాని వారికి సూచించినట్లు సమాచారం.

Tags:    

Similar News