Paris Olympics 2024 : క్వార్టర్ ఫైనల్లో భారత రెజ్లర్ రితికా..

ప్యారిస్ ఒలింపిక్స్-2024లో మరో భారత రెజ్లర్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మహిళల 76 కేజీల క్యాటగిరిలో భారత రెజ్లర్ రితికా హుడా హంగేరికి చెందిన బెర్నాడెట్‌తో తలపడింది.

Update: 2024-08-10 11:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్యారిస్ ఒలింపిక్స్-2024లో మరో భారత రెజ్లర్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మహిళల 76 కేజీల క్యాటగిరిలో భారత రెజ్లర్ రితికా హుడా హంగేరికి చెందిన బెర్నాడెట్‌తో తలపడింది. శనివారం జరిగిన ప్రక్వార్టర్స్‌ (రౌండ్ 16)లో రితికా 12-2 తేడాతో బరిలో నిలిచింది. దీంతో ‘సుపీరియారిటీ’ పద్దతిలో రితికాను విజేతగా ప్రకటించారు. దీంతో క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. కాగా, బౌట్‌లో ఇద్దరు రెజ్లర్ల మధ్య పది పాయింట్ల తేడా వచ్చిన వెంటనే.. రిఫరీ బౌట్‌ను నిలిపి వేసి.. పది పాయింట్లు అధిక్యంలో ఉన్న రెజ్లర్‌ను సుపీరియారిటీ పద్దతిలో విజేతలను ప్రకటిస్తారు.

అయితే నిన్న రాత్రి అమన్ సెహ్రావత్‌ పురుషుల 57 కిలోల ఫ్రీ స్టయిల్‌ విభాగంలో కాంస్య పథకం సాధించిన విషయం తెలిసిందే. వినేశ్‌ ఫోగాట్ పతకం విషయంలో నిరాశగా ఉన్న భారత క్రీడాభిమానులకు అమన్‌ కాంస్యం కాస్త స్వాంతన కలిగించేదే. ఇప్పుడు రితికా కూడా అద్భుత ప్రదర్శన ఇవ్వడంతో తను కూడా పతకం తెస్తుందనే భారత క్రీడాభిమానులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, క్వాటర్స్ లో కిరిగిస్థాన్‌కు చెందిన రెజ్లర్ తో రితికా పోటీ పడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే.. సెమీ ఫైనల్స్ లోకి అడుగుపెడితే రితికా భారత్ కు మెడల్ తీసుకు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాగా, రెజ్లింగ్‌లో అమన్ గెలవడంతో భారత్‌కు మొత్తం 6 మెడల్స్ లభించాయి.

Tags:    

Similar News