దిశ, స్పోర్ట్స్ : మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా మహిళల జట్టుకు భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. జూన్ 16 నుంచి 23 వరకు మూడు వన్డేల సిరీస్, జూన్ 28 నుంచి జూలై 1 వరకు ఏకైక టెస్టు, జూలై 5 నుంచి 9 వరకు టీ20 సిరీస్ జరగనుంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు బీసీసీఐ వేర్వేరుగా భారత జట్లను గురువారం ప్రకటించింది. మూడు ఫార్మాట్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. ఆమెకు డిప్యూటీగా స్మృతి మంధాన ఎంపికైంది. స్టార్ ప్లేయర్లు రోడ్రిగ్స్, పూజ వస్త్రాకర్ ఫిట్‌నెస్‌ను బట్టి ఈ సిరీస్‌కు అందుబాటులో ఉంటారు. బంగ్లాదేశ్ టూరులో టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఆశా శోభన తొలిసారిగా వన్డే జట్టుకు ఎంపికైంది. అలాగే, వికెట్ కీపర్ ఉమా చెత్రి మొదటి సారి జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకుంది. దాదాపు ఏడాది తర్వాత బ్యాటర్ ప్రియా పూనియా తిరిగి జట్టులోకి వచ్చింది.
వన్డే జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, రోడ్రిగ్స్, రిచా ఘోష్, ఉమా చెత్రి, హేమలత, రాధా యాదవ్, ఆశా శోభన, శ్రేయాంక, సైకా ఇషాక్, పూజ వస్త్రాకర్, రేణుక సింగ్, అరుంధతి రెడ్డి, ప్రియా పూనియా.
టెస్టు జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, శుభా సతీశ్, రోడ్రిగ్స్, రిచా ఘోష్, ఉమా చెత్రి, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, సైకా ఇషాక్, రాజేశ్వరి గైక్వాడ్, పూజ వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, మేఘ్న సింగ్, ప్రియా పూనియా.
టీ20 జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, హేమలత, ఉమా చెత్రి, రిచా ఘోష్, రోడ్రిగ్స్, సజన సజీవన్, దీప్తి శర్మ, శ్రేయాంక, రాధా రాదవ్, అమన్‌జోత్ కౌర్, ఆశా శోభన, పూజ వస్త్రాకర్, రేణుక సింగ్, అరుంధతి రెడ్డి. స్టాండ్ బై : సైకా ఇషాక్.