IBSA World Games 2023 Cricket: అంధుల క్రికెట్ టోర్నీ ఫైనల్స్‌లో భారత్ మహిళల జట్టు విజయం.. తొలి ఛాంపియన్స్‌గా రికార్డు..

ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐబీఎస్‌ఏ) ప్రపంచ క్రికెట్ క్రీడల ఫైనల్స్‌లో.. భారత అంధుల మహిళల క్రికెట్ జట్టు గెలుపొందింది.

Update: 2023-08-26 15:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐబీఎస్‌ఏ) ప్రపంచ క్రికెట్ క్రీడల ఫైనల్స్‌లో.. భారత అంధుల మహిళల క్రికెట్ జట్టు గెలుపొందింది. ఇంగ్లాండ్ వేదికగా శనివారం జరిగిన తుదిపోరులో ఆస్ట్రేలియా అంధుల జట్టుతో తలపడిన భారత మహిళలు 9 వికెట్ల తేడాతో నెగ్గి.. గోల్డ్ మెడల్ సాధించారు. టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ పోరులో భారత మహిళల జట్టు.. మొదట బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థి ఆసీస్‌ను 114/8 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం భారత మహిళల జట్టు లక్ష్యాన్ని 9 ఓవర్లలో 42 పరుగులను నిర్దేశించారు. ఈ టార్గెట్‌ను టీమ్ ఇండియా అంధ మహిళలు ఒక వికెట్ కోల్పోయి 3.3 ఓవర్లలోనే ఛేదించి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించారు.


Similar News