టీ20లో ఆ ఘనత సాధించిన చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెటర్
మహిళల టీ20 ప్రపంచ కప్ సౌత్ ఆఫ్రికా వేధికగా ఫిబ్రవరి 15న భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
దిశ, వెబ్‌డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్ సౌత్ ఆఫ్రికా వేధికగా ఫిబ్రవరి 15న భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ దీప్తి శర్మ చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో శర్మ నాలుగు ఓవర్లు వేసి.. 3 వికెట్లు తీసి టీ20 లలో 100 వికెట్లకు చేరుకుంది. దీంతో దీప్తి శర్మ టీ20లో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది.
కాగా దీప్తి శర్మకు ఈ ఘనతను కేవలం 89 మ్యాచుల్లోనే సాధించడం విశేషం. కాగా ఇంతకు ముందు భారత్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా.. పూనమ్ యాదవ్.. 72 మ్యాచుల్లో 98 వికెట్ల నిలిచింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా టీ20లలో 100 వికెట్లు సాధించిన వారిలో.. సీనియర్ వెస్టిండీస్ స్పిన్నర్ అనీసా 117 మ్యాచుల్లో 125 వికెట్లతో మొదటి స్థానంలో ఉంది. అలాగే పాకిస్తాన్ బౌలర్ నిదాదార్ 121 వికెట్లతో రెండో స్థానంలో, ఆస్ట్రేలియా బౌలర్ ఎలీస్ పెర్రీ 120 వికెట్లతో మూడో స్థానంలో ఉండగా.. దీప్తి శర్మ 9 స్థానంలో కొనసాగుతోంది.