Junior World Championship : షూటింగ్‌లో రెండు స్వర్ణాలు, కాంస్యం.. భారత్‌కు అదిరిపోయే బోణీ

పెరూలో జరుగుతున్న జూనియర్ షూటింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌‌లో భారత యువ షూటర్లు ఘనంగా బోణీ కొట్టారు.

Update: 2024-09-29 13:47 GMT

దిశ, స్పోర్ట్స్ : పెరూలో జరుగుతున్న జూనియర్ షూటింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌‌లో భారత యువ షూటర్లు ఘనంగా బోణీ కొట్టారు. తొలి రోజే మూడు పతకాలు కొల్లగొట్టారు. అందులో రెండు స్వర్ణాలు ఉండటం విశేషం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత జూనియర్ పురుషుల, మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి. ఉమేశ్ చౌదరి(580), ముకేశ్ నెలవల్లి(574), ప్రమోద్(572)లతో కూడిన జూనియర్ పురుషుల జట్టు 1726 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. రొమానియా(1716), ఇటలీ(1707) జట్లు రజతం, కాంస్యం దక్కించుకున్నాయి. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 3వ స్థానంలో నిలిచిన ఉమేశ్ వ్యక్తిగత ఫైనల్‌లో 6వ స్థానంతో సరిపెట్టాడు. మరోవైపు, జూనియర్ మహిళల విభాగంలోనూ భారత్‌కు స్వర్ణం దక్కింది. కనిష్క(573), లక్షిత(571), అంజలి చౌదరి(564)లతో కూడిన త్రయం 1708 స్కోరుతో విజేతగా నిలిచింది. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో కనక్ కాంస్యం గెలుచుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో కనక్ 573 స్కోరుతో 5వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. మెడల్ రౌండ్‌లోనూ మెరిసిన ఆమె 217.6 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి పతకం సొంతం చేసుకుంది. కనిష్క(115.1) 8వ స్థానంతో సరిపెట్టింది. 

Tags:    

Similar News