హైదరాబాద్ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. అనూహ్యంగా వేదిక మార్పు

మహానగరం వేదికగా జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున చెన్నై నగరానికి మారింది. నవంబర్ 4,5 తేదీల్లో జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్ కారు రేసింగ్ పోటీలకు మరోసారి చెన్నై అనూహ్యంగా వేదిక కానుంది. ఇప్పటికే ఈ కార్ రేసింగ్ పోటీలు హుస్సేన్ సాగర తీర నిర్వహించేందుకు అధికారులు వివిధ రకాల ఏర్పాట్లను కూడా చేశారు.

Update: 2023-10-31 16:17 GMT

దిశ, సిటీ బ్యూరో: మహానగరం వేదికగా జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున చెన్నై నగరానికి మారింది. నవంబర్ 4,5 తేదీల్లో జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్ కారు రేసింగ్ పోటీలకు మరోసారి చెన్నై అనూహ్యంగా వేదిక కానుంది. ఇప్పటికే ఈ కార్ రేసింగ్ పోటీలు హుస్సేన్ సాగర తీర నిర్వహించేందుకు అధికారులు వివిధ రకాల ఏర్పాట్లను కూడా చేశారు. ఇపుడు ఈ రేసింగ్ పోటీలు చెన్నైకి మారటంతో మహానగరంలోని రేసింగ్ ప్రియులు ఒకింత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గతంలో నిర్వహించిన రేసింగ్ ట్రాక్ పైనే ఈ పోటీలు నిర్వహిస్తున్న ప్రకటించిన నిర్వాహకులు ఇందుకు సంబంధించి ఆన్ లైన్‌లో కూడా టికెట్లను విక్రయించారు.

ఇపుడు ఎలక్షన్ కోడ్ కారణంగా రేసింగ్ పోటీలు చెన్నైకి మారటంతో ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన రేసింగ్ ప్రియుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. తాను చెన్నై వెళ్లి తిలకించాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ, నిర్వాహకులు మాత్రం రేసింగ్ ప్రియులతో వస్తున్న ఒత్తిడి కారణంగా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టికెట్లు కొనుగోలు చేసిన, వారికి తిరిగి చెల్లించేలా త్వరలో ప్రకటన వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ఎలక్షన్ కోడ్ వస్తుందంటూ ముందుగా ఊహించకపోవటం వల్లే తమకు కాస్త నష్టం వాటిల్లందంటూ ఇండియన్ కార్ రేసింగ్ పోటీలు నిర్వాహకులు వాపోతున్నారు.

Tags:    

Similar News