9 ఏళ్ల తర్వాత ఫైనల్‌.. భారత పురుషుల రికర్వ్ టీమ్ అర్హత

Update: 2023-04-20 16:15 GMT

అంటాల్య: తుర్కియేలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1 పురుషుల రికర్వ్ టీమ్ కేటగిరీలో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దాంతో ఈ కేటగిరీలో 9 ఏళ్ల తర్వాత భారత్ తుదిపోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అతాను దాస్, ధీరాజ్, తరుణ్‌దీప్ రాయ్‌లతో కూడిన భారత్ 6-2 తేడాతో నెదర్లాండ్స్‌ జట్టును ఓడించింది. తొలి సెట్‌ను కోల్పోయినప్పటికీ భారత త్రయం వరుసగా మూడు సెట్లను సాధించి గేమ్‌ను గెలుచుకుంది.

అంతకుముందు తొలి రౌండ్‌లో జపాన్‌ను షూటౌట్‌లో చిత్తు చేసిన భారత్.. క్వార్టర్స్‌లో చైనీస్ తైపీ టీమ్‌పై 2-6 తేడాతో విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్‌లో భారత్.. చైనాతో తలపడనుంది. ఈ కేటగిరీలో భారత్ విజేతగా నిలిస్తే 13 ఏళ్ల తర్వాత గోల్డ్ మెడల్ సాధిస్తుంది. చివరిసారిగా 2010లో భారత్ పరుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకుంది.

Tags:    

Similar News