Mohammed Habib: ఇండియన్ ఫుట్‌బాల్ లెజెండ్ మహ్మద్ హబీబ్ కన్నుమూత..
ఇండియన్ ఫుట్‌బాల్ లెజెండ్, హైదరాబాద్‌కు చెందిన ప్లేయర్మహ్మద్ హబీబ్(74) కన్నుమూశారు.
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ఫుట్‌బాల్ లెజెండ్, హైదరాబాద్‌కు చెందిన ప్లేయర్మహ్మద్ హబీబ్(74) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా డిమెన్షియా అండ్ పార్కిన్సన్స్ సిండ్రోమ్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. నేడు (ఆగస్ట్ 15)న తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో 1949 జులై 17న జన్మించిన ఆయన.. హైదరాబాద్‌లోనే మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. 1970 బ్యాంకాక్ వేదికగా జరిగిన ఆసియన్ గేమ్స్‌లో మరో హైదరాబాదీ ప్లేయర్ సయ్యద్ నయీముద్దీన్ కెప్టెన్సీలో ఆడిన హబీబ్.. బ్రాంజ్ మెడల్‌ను అందుకున్నారు. ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత కోచ్‌గా వ్యవహరించారు. మహ్మద్ హబీబ్ 1965 నుంచి 76 మధ్య కాలంలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించారు.