ద్వైపాక్షిక సిరీస్ మర్చిపోండి : పీసీబీ చైర్మన్‌కు బీసీసీఐ వర్గాలు కౌంటర్
పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు ఇష్టపడతానని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల ఓ షోలో తెలిపాడు.
దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు ఇష్టపడతానని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల ఓ షోలో తెలిపాడు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్పందిస్తూ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం టీమ్ ఇండియా పాక్‌కు వస్తే ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే విషయం గురించి ఆలోచిస్తామని చెప్పాడు. దీనికి బీసీసీఐ వర్గాలు గట్టి కౌంటర్ ఇచ్చాయి.
ద్వైపాక్షిక సిరీస్ గురించి మర్చిపోవాలని, ముందు చాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా భారత్ పాక్‌లో పర్యటించకపోవచ్చని తెలిపాయి. చాంపియన్స్ ట్రోఫీ వేదిక మారే అవకాశం ఉందని, లేదంటే హైబ్రిడ్ మోడల్‌లో జరగొచ్చని చెప్పాయి. ‘ప్రస్తుతం పాకిస్తాన్‌తో సంబంధాలు బాగా లేవు. పర్యటనకు భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరి.’ అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. కాగా, వచ్చే ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీ కోసం టీమ్ ఇండియా పాక్‌లో పర్యటించడంపై సందేహాలు నెలకొన్నాయి. గతేడాది ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్‌లో జరగగా.. చాంపియన్స్ ట్రోఫీని కూడా అదే తరహాలో నిర్వహించాలని ఐసీసీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.