Asian Kabaddi Championship 2023: ఆసియా కప్ విజేతగా భారత్..
ఏషియన్ కబడ్డీ చాంపియన్‌షిప్ 2023 టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: ఏషియన్ కబడ్డీ చాంపియన్‌షిప్ 2023 టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది. దక్షిణ కొరియా బుసాన్ వేదికగా ఇరాన్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 42-32 తేడాతో ఓడించింది. భారత్‌కు ఆసియా కప్ టైటిల్ నెగ్గడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. భారత కెప్టెన్ పవన్ షెహ్రావత్ 10 పాయింట్లతో సత్తాచాటాడు. ఈ మ్యాచ్ తొలి ఐదు నిమిషాలలు వెనుకబడిన టీమిండియా ఆ తర్వాత సత్తాచాటింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి భారత్ 23-11తో ఆధిక్యంలో నిలిచింది. అయితే, ఆ తర్వాత పోరు హోరాహోరీగా సాగింది. ఓ దశలో పాయింట్లు 38-31కు చేరాయి. అయితే, మళ్లీ భారత్ పుంజుకుంది. 42-32 తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకొని.. ఆసియన్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకుంది.
Team 🇮🇳 Asian CHAMPIONS 🏆!
— SAI Media (@Media_SAI) June 30, 2023
With the score of 42-32 in the final match against 🇮🇷, Team 🇮🇳 retains the Asian Kabaddi Championship Title!
Meet our champions which include 6️⃣ #NCOEAthletes from @SAI_Gandhinagar
Kudos to the entire team 🥳
Well played boys👏💪🏻 pic.twitter.com/UzAgnpEuFR