Asian Games 2023: దుమ్మురేపుతున్న షూటర్లు.. భారత్‌కు మరో గోల్డ్

ఆసియా గేమ్స్ 2023లో భారత షూటర్లు దుమ్మురేపుతున్నారు.

Update: 2023-09-28 10:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా గేమ్స్ 2023లో భారత షూటర్లు దుమ్మురేపుతున్నారు. బుధవారం మహిళా షూటర్లు పతకాల మోత మోగించగా.. గురువారం పురుష షూటర్లు సత్తా చాటారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమాతో కూడిన భారత బృందం పసిడి పతకం సొంతం చేసుకుంది. భారత షూటర్లు 1734 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలవగా.. 1733 పాయింట్లతో ఆతిథ్య చైనా రెండో స్థానంలో నిలిచింది. 1730 స్కోర్‌తో వియాత్నం కాంస్య పతకం సొంతం చేసుకుంది.

భారత షూటర్లలో సరబ్‌జోత్ 580 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా.. అర్జున్ 578 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచి వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించారు. ఈ రోజు మధ్యాహ్నం వ్యక్తిగత విభాగం ఫైనల్స్ జరగనున్నాయి. ఇక ఇది భారత్‌కు ఆరో గోల్డ్ మెడల్ కాగా.. ఇందులో నాలుగు పతకాలు షూటింగ్‌లోనే రావడం విశేషం. ఓవరాల్‌గా 24 పతకాలతో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. ఇందులో 6 స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి.

Similar News