2023 వరల్డ్ కప్ వల్ల భారత్‌కు వేల కోట్ల ఆదాయం
2023 వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే.
దిశ, స్పోర్ట్స్: 2023 వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే. మన దేశంలో వరల్డ్ కప్ టోర్నీలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రతిష్టాత్మకమైన ఈ మెగా టోర్నీలో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాలకు చెందిన అభిమానులు భారత్‌కు విచ్చేశారు. అయితే, ఈ వరల్డ్ కప్ టోర్నీలో వరుస విజయాలతో ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా.. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. కేవలం రన్నరప్‌తో సరిపెట్టుకుంది. భారతీయ గడ్డపై జరిగిన వరల్డ్ కప్ టోర్నీ ఆస్ట్రేలియా జట్టు ఎగరేసుకుని పోయి విజేతగా నిలిచింది.
రోహిత్ సారథ్యంలో మొదటి వన్డే వరల్డ్ కప్ ఓడిపోవడంతో జట్టు సభ్యులే కాకుండా దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే, వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు రూ.11,637 కోట్ల ఆదాయం సమకూరిందని ఐసీసీ తాజాగా ప్రకటించింది. మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చిన నగరాల్లో టూరిజం, వసతి, ప్రయాణం, ఆహారం, రవాణా, డ్రింక్స్ అమ్మకాల ద్వారా 861.4 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. వన్డే ప్రపంచ కప్ వల్ల ఆతిథ్య రంగంలో ప్రత్యక్షంగా సుమారు 48,000 కంటే ఎక్కువ మంది పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ ఉద్యోగావకాశాలు పొందారని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) పేర్కొంది.