IND vs PAK: 9 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం! 34 ఓవర్ల మ్యాచ్‌

ఆసియా కప్‌-2023లో భాగంగా కొలొంబో వేదికగా భారత్‌-పాక్‌ల మధ్య ఇవాళ జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌ వర్షం కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయింది.

Update: 2023-09-10 15:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌-2023లో భాగంగా కొలొంబో వేదికగా భారత్‌-పాక్‌ల మధ్య ఇవాళ జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌ వర్షం కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేయగా.. 24.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఈ దశలో 5  గంటలకు ప్రారంభమైన వర్షం రాత్రి 7 గంటల సమయంలో కాస్త ఎడతెరిపినిచ్చినప్పటికీ మైదానం మొత్తం చిత్తడిగా ఉండటంతో మరి కాసేపు (రాత్రి 7:30 గంటల వరకు) వెయిట్‌ చేయాలని ఇరు జట్ల కెప్టెన్లు రిఫరీని కోరారు. అయితే 7:30 నిమిషాలకు స్టేడియాన్ని పరిశీలించిన అంపైర్లు.. మ్యాచ్‌ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. స్టేడియంలో అక్కడక్కడ ఇంకా తడిగా ఉండటమే ఇందుకు కారణం.8.30 నిమిషాలకు మరొకసారి అంపైర్లు మైదానాన్ని పరిశీలించనున్నారు. మ్యాచ్‌ 9 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే మ్యాచ్‌ను 34 ఓవర్లకు కుదించే ఛాన్స్‌ ఉంది. స్టేడియంలో తడి లేకుండా చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్‌ బ్యాటింగ్‌కు దిగే అవకాశం లేకుండా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్థతి ప్రకారం.. పాక్‌కు టార్గెట్‌ నిర్ధేశించాల్సి వస్తే పరిస్థితి ఇలా ఉంటుంది. కనీసం 20 ఓవర్ల మ్యాచ్‌ జరగాలంటే కటాఫ్‌ టైమ్‌ రాత్రి 10:30 గంటలు. దీని తర్వాత మ్యాచ్‌ సాధ్యపడే అవకాశం లేదు. మ్యాచ్‌ రిజర్వ్‌ డే అయిన రేపు (సెప్టెంబర్‌ 11) నిర్వహించాల్సి ఉంటుంది. భారత్‌ తిరిగి బ్యాటింగ్‌కు దిగకుండా 20 ఓవర్ల మ్యాచ్‌ అయితే (DLS ప్రకారం) పాక్‌ లక్ష్యం 181 పరుగులుగా ఉంటుంది.


Similar News