IND vs IRE 1st T20I: ఐర్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌.. టాస్ గెలిచిన టీమిండియా

ఐర్లాండ్‌తో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

Update: 2023-08-18 13:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐర్లాండ్‌తో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 14 నెలల తర్వాత జస్ప్రిత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వబోతుండడంతో అతనిపైనే అందరి ఫోకస్ ఉంది. జస్ప్రిత్ బుమ్రా టీ20ల్లో టీమిండియాకి కెప్టెన్సీ చేస్తున్న మొట్టమొదటి స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకూ సింగ్, నేటి మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేస్తున్నాడు. అలాగే గాయంతో ఏడాదిగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న ప్రసిద్ధ్ కృష్ణ, నేటి మ్యాచ్ ద్వారా టీ20 ఆరంగ్రేటం చేస్తున్నాడు.

ఐర్లాండ్ పేరుకి చిన్న జట్టే అయినా ఇంగ్లాండ్ వంటి టాప్ టీమ్స్‌కి చుక్కలు చూపించిన చరిత్ర దానికి ఉంది. గత పర్యటనలోనూ ఐర్లాండ్, టీమిండియాకి దాదాపు షాక్ ఇచ్చినంత పని చేసింది. దీపక్ హుడా సెంచరీలతో టీమిండియా 225 పరుగుల భారీ స్కోరు చేస్తే, ఆ లక్ష్యఛేదనలో 221 పరుగులు చేసి 4 పరుగుల తేడాతో పోరాడి ఓడింది ఐర్లాండ్..

ఐర్లాండ్ (ప్లేయింగ్ XI):

పాల్ స్టిర్లింగ్(సి), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్(w), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్

భారత్ (ప్లేయింగ్ XI):

రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(w), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా(c), రవి బిష్ణోయ్



Similar News