బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భారత్ 4-0 తో గెలుస్తుంది: గవాస్కర్
భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆస్ట్రేలియా జట్టు ఆట తీరు పై కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆస్ట్రేలియా జట్టు ఆట తీరు పై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో జరుగుతన్న ఈ సిరిస్‌లో బ్యాటర్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే "తగినంత పరుగులు" చేయకపోతే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 4-0తో భారత్ వైట్‌వాష్ చేస్తుందని తాను నమ్ముతున్నానని సునీల్ గవాస్కర్ అన్నాడు. అలాగే నాగ్ పూర్ టెస్టులో ఓటమి నుంచి వారు పాఠాలు నేర్చుకోవాలని.. ఆస్ట్రేలియా జట్టుకు రెండో టెస్ట్ లో గొప్ప ప్రారంభం కావాలని ఆయన అన్నారు.
కాగా నాగ్ పూర్ వేదికగా జరిగి మొదటి టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టులో కిలకంగా భావించిన మార్నస్ 66 పరుగులు చేయగా, స్మిత్ 62 పరుగులు చేశాడు. అలాగే డేవిడ్ వార్నర్ కూడా అనుకున్నంత రాణించకపోవడం, భారత స్పిన్నర్లు ఆస్ట్రేలియాపై విరుచుకుపడటంతో తమ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత తక్కువ స్కోరుకే ఆలౌట్ అయి ఓడిపోయారు. కాగా రెండో టెస్ట్.. ఈ నెల 17 నుంచి..ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది.