ఒలంపిక్స్-2036 ఆతిధ్యం భారత్?

పారిస్ ఒలంపిక్ వేడుకలు నేటితో ముగుస్తుండగా.. వచ్చే ఒలంపిక్స్ కు ఆతిధ్యం ఇచ్చే దేశాల గురించి చర్చ మొదలైంది.

Update: 2024-08-11 15:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : పారిస్ ఒలంపిక్ వేడుకలు నేటితో ముగుస్తుండగా.. వచ్చే ఒలంపిక్స్ కు ఆతిధ్యం ఇచ్చే దేశాల గురించి చర్చ మొదలైంది. 2028 ఒలంపిక్స్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఆతిధ్యం ఇస్తుండగా, 2032 లో జరిగే ఉత్సవాలకు ఆతిధ్యం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ సిటీ ఇస్తోంది. ఇక 2036 లో జరిగే ఒలంపిక్ క్రీడల ఆతిధ్యం ఏ దేశం ఇవ్వనుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నడుస్తోంది. 2036 లో జరిగే ఒలంపిక్ ఉత్సవాలకు భారత్ ఆతిధ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండగా.. ఇపుడా పోటీలోకి తాజాగా ఈజిప్ట్ వచ్చి చేరిందని తెలుస్తోంది. ఒలంపిక్స్ 2036, 2040 ఆతిధ్యం కోసం ఈజిప్ట్ బిడ్డింగ్ వేయనుందని ఆదివారం ఆఫ్రికన్ నేషనల్ ఒలంపిక్ కమిటీస్ అసోసియేషన్ వెల్లడించింది. ఆఫ్రికా ఖండంలోని ఏ ఒక్క దేశం కూడా ఇప్పటి వరకు ఒలంపిక్స్ కు ఆతిధ్యం ఇవ్వలేదు. అందుకే ఎలాగైనా ఆతిధ్య హక్కులు దక్కించుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. విశ్వ క్రీడలకు అవసరమయ్యే స్టేడియాలు, ప్రాంగణాలు, వేదికలు నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నాయి. 2036 ఒలంపిక్ ఆతిధ్య హక్కుల పోటీలో భారత్, ఈజిప్ట్ మాత్రమే కాకుండా.. సౌదీ అరేబియా, ఖతార్, ఇండోనేషియాలు కూడా ఉన్నాయి. మరి ఎవరికి ఆ అవకాశం దక్కనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.      


Similar News