బెంగళూరు: సౌత్ ఏషియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(శాఫ్) చాంపియన్‌షిప్‌కు ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనుంది. బెంగళూరు వేదికగా జూన్ 21 నుంచి జూలై 3వ తేదీ వరకు టోర్నీ జరుగుతుంది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఏఐఎఫ్ఎఫ్) ప్రెసిడెంట్ కళ్యాణ్ చూబే వెల్లడించారు. శాఫ్ చాంపియన్‌షిప్‌కు భారత్ ఆతిథ్యమివ్వడం ఇది నాలుగోసారి. చివరిసారిగా 2015లో తిరువనంతపురం వేదికైంది.
అలాగే, శాఫ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తిరుగులేని రికార్డు ఉన్నది. 12 ఎడిషన్లలో 8 సార్లు విజేతగా నిలిచింది. 2021లో జరిగిన చివరి ఎడిషన్‌లో టైటిల్ సాధించిన భారత్.. ఈ ఎడిషన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగబోతున్నది.