స్వేచ్ఛగా, నిర్భయంగా ఆడండి : టీమ్ ఇండియాకు గంగూలీ సూచన

టీ20 వరల్డ్ కప్‌ నేపథ్యంలో టీమ్ ఇండియా ఆటగాళ్లకు భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కీలక సూచన చేశాడు.

Update: 2024-06-01 15:58 GMT

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌ నేపథ్యంలో టీమ్ ఇండియా ఆటగాళ్లకు భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కీలక సూచన చేశాడు. ప్రపంచకప్‌లో స్వేచ్ఛగా, నిర్భయంగా ఆడాలని సూచించాడు. శనివారం ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచే అవకాశాలపై మాట్లాడాడు. టీమ్ ఇండియా ఈ సారి ప్రపంచకప్ గెలిచే చాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయన్నాడు. ‘టీమ్ ఇండియా టీ20 జట్టుగా ఆడాలి. భారత జట్టులో ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నారు. ప్రతి ఒక్కరూ భారత్‌ను గెలిపించే సమర్థులే. నిర్భయంగా ఆడండి. స్వేచ్ఛగా ఆడండి.’ అని చెప్పాడు.

ఐపీఎల్‌లో విరాట్ ఓపెనర్‌గా సత్తాచాటాడని, టీ20 వరల్డ్ కప్‌లో అతను రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేయాలన్నాడు. జూన్ 9న భారత్, పాక్ మ్యాచ్ గురించి గంగూలీ మాట్లాడుతూ.. పాక్‌పై భారత్‌కు మంచి రికార్డు ఉందని చెప్పాడు. అయితే, వన్డేలతోపోలిస్తే టీ20 ఫార్మాట్‌లో పాక్ జట్టు ప్రమాదకరమన్నాడు. అలాగే, ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను దాదా సమర్థించాడు. అయితే, రెండు మార్పులను సూచించాడు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే మైదానాల్లో బౌండరీలు ఇంకాస్త పెద్దగా ఉండాలన్నాడు. అలాగే, ఇంపాక్ట్ ప్లేయర్‌ను టాస్ కంటే ముందు రివీల్ చేయాలని చెప్పాడు. 


Similar News